2013లో జయలలిత హయాంలో అలా అవమానం... 2026లో సీఎంగా విజయ్ ప్రమాణం!

  • సినిమా శతాబ్ది ఉత్సవాల్లో విజయ్‌కి వెనుక సీటు
  • వెనుక వరుసలో ఉండటాన్ని గుర్తించి అతని వద్దకు వెళ్లిన విక్రమ్
  • విజయ్‌కి జరిగిన అవమానంగా భావించిన అభిమానులు
  • గతంలో అవమానపడి ముఖ్యమంత్రి అయిన జయలలిత
పదమూడేళ్ళ క్రితం చెన్నైలో సినిమా శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకకు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నాటి ముఖ్యమంత్రి జయలలిత హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన 'తలైవా' చిత్రం విడుదలలో జాప్యం కారణంగా అప్పటికే విజయ్ తీవ్ర అసంతృప్తితోనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి నాడు విజయ్‌కి ఇటు సినీ పరిశ్రమ నుంచి లేదా అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు.

సినిమా విడుదల విషయం పక్కన పెడితే, సినిమా శతాబ్ది ఉత్సవాలకు హాజరైన విజయ్‌కి వెనుక వరుసలో సీటు ఇచ్చారు. నటుడు చియాన్ విక్రమ్‌తో పాటు పలువురు ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ వెనుక వరుసలో ఉండటాన్ని గమనించిన విక్రమ్ ముందు వరుస నుంచి వెనక్కి వెళ్లి అతని పక్కన కూర్చున్నారు. అప్పటి వరకు విజయ్ ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ కూడా విక్రమ్‌ను అనుసరించారు. దీనికి సంబంధించి విజయ్ ఎవరినీ తప్పుపట్టలేదు.

విజయ్‌ని బహిరంగంగా అవమానించినట్లు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు భావించారు. ప్రజల అభిమానంతో రాజకీయాల్లో ఎదిగిన ఎంజీఆర్‌ను అప్పటికే తమిళనాడు చూసింది. జయలలిత కూడా సినిమా పరిశ్రమ నుంచే ఎదిగారు. తమిళనాడులో సినీతారలను ఆరాధించే సంస్కృతి ఎక్కువ. ఇలాంటి చోట ప్రముఖ నటుడిని అవమానిస్తే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళుతుందో జయలలితకు తెలుసు.

స్వయంగా జయలలిత కూడా ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. జయలలిత కంటతడి పెడుతూ సభ నుంచి వెలుపలకు వస్తూ శపథం చేశారు. ఈ ఘటనను మహాభారతంలోని ద్రౌపదికి జరిగిన అవమాన ఘటనతో పోల్చుకున్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని సవాల్ చేశారు. ఆ తర్వాత 1991లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత విజయ్ అలాగే అవమానానికి గురై, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.

Vijay Thalapathy
Vijay
Tamil Nadu
Jayalalitha
Tamil Cinema
Kollywood
Vikram
Aishwarya Rajinikanth

More Telugu News